తెలంగాణలో చలి తీవ్రత.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ చలి తీవ్రత: మొన్నటి వరకు కుండపోత వానతో తడిచిముద్దైన తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు చలి పులి పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి నుంచి చలి తీవ్రత ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య దిశ నుంచి తక్కువ.

తెలంగాణ చలి తీవ్రత, NewzFast Telugu (తెలంగాణ): మొన్నటి వరకు కుండపోత వానతో తడిచిముద్దైన తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు చలి పులి పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

రాత్రి నుంచి చలి తీవ్రత ప్రారంభమైంది.

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న పొడి, చల్లని గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే దిగువకు నమోదవుతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, జనగామ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామలలో 14.8 డిగ్రీలుగా రికార్డయింది.

రాజధాని హైదరాబాద్ పరిధిలోనూ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది.

ప్రధానంగా రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, హయత్ నగర్, శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల్లో తెల్లవారుజామున తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. పగటి సమయాల్లో పొడి వాతావరణం, సాధారణ ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం నుంచి వాతావరణం వేగంగా చల్లబడుతోంది.

అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో వేకువజామున తీవ్రమైన పొగమంచు కమ్ముకునే అవకాశముంది. దీంతో రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గే ప్రమాదముందని, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వేగాన్ని తగ్గించి, ఫాగ్ లైట్లను ఉపయోగించాలని, ముందు వెళ్లే వాహనాల నుంచి తగినంత దూరం పాటించాలని కోరారు.

చలిగాలుల దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలున్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేకువజామున అనవసరంగా బయటకు రావద్దని, బయటకు వచ్చేటప్పుడు వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని స్పష్టం చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు