తమ్మిడి కుంట చెరువు, NewzFast Telugu (హైదరాబాద్): టాలీవుడ్ నటుడు నాగార్జున తమ్మిడి కుంట చెరువును అద్భుతంగా డిజైన్ చేశారని అన్నారు. చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు.
మొదట భూమి విషయంలో రంగనాథ్ తనతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు, మనసులో ఏదో అభిప్రాయం పెట్టుకుని వెళ్లానని నాగార్జున చెప్పారు. అయితే ఆయన చాలా ఓపికగా తనతో మాట్లాడారని, ఆయన మాటలు విన్న తర్వాత తన మనసు మారిందని వివరించారు.
ఎవరూ డెబిట్ కార్డ్ తీసుకుని పైకి వెళ్లమని, మన నగరం కోసం ఇది చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మన నగరం ఎందుకు అలా ఉండదని తాను ఆలోచించేవాడినని, ఇప్పుడు ఈ చెరువును చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తమ్మిడి కుంట చెరువు వద్ద తాను సినిమా షూటింగ్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెరువులు, నదులు అంటే చాలా ఇష్టమని, ఎంతో సంకల్పంతో ఆయన ఈ పనిచేస్తున్నారని నాగార్జున పేర్కొన్నారు.
మంచి పని చేసేటప్పుడు నెగిటివిటీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
చెరువును బాగు చేయడం ద్వారా వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యను కూడా నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నీళ్లు చెరువులోకి వెళితే ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదని, చెరువుల్లో నీళ్లు ఉంటే ఎల్నినో వంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవచ్చని చెప్పారు.
మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నారని, దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినా తాను వెళతానని నాగార్జున తెలిపారు.




