సూర్యాపేట రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (సూర్యాపేట, తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులో శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన మీసాల చిన్న పిచ్చయ్య, మీసాల లోకేశ్వరి దంపతులు బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు.
లోకేశ్వరి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అదే సమయంలో సూర్యాపేటకు చెందిన చింత లోకేశ్ అనంతారంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి బైక్‌లు ఢీకొన్నాయి.
ప్రమాదంలో చిన్న పిచ్చయ్య, లోకేశ్వరి, చింత లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.




