సురక్ష మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, NewzFast Telugu (భూపాలపల్లి): ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన సురక్ష మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది.
ఐదేళ్లుగా భూపాలపల్లి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఆసుపత్రి ఐదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అధికారిక వెబ్సైట్ను ప్రారంభించింది. సాంకేతికతను వినియోగించుకుంటూ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
వెబ్సైట్ ద్వారా రోగులు తమ ఇళ్ల నుంచే వైద్యుల అపాయింట్మెంట్లను సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఆసుపత్రికి వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ముందుగానే వైద్యులను సంప్రదించేందుకు సమయాన్ని పొందవచ్చు.
అత్యవసర సమయాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 24 గంటలూ ఐదుగురు నిపుణులైన సంప్రదింపు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. రోగుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా వైద్య సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది.
ఐదేళ్ల ప్రస్థానంలో తమపై నమ్మకంతో వైద్య సేవలు పొందిన ప్రతి ఒక్కరికీ, నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల నమ్మకమే తమ బలమని, భవిష్యత్తులోనూ నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ పద్మ ప్రవళిక, డాక్టర్ విశ్వకాంత్ తేజ, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ విక్రమ్, డాక్టర్ వంశీకృష్ణ, సిబ్బంది అర్జున్ తదితరులు పాల్గొన్నారు.




