సుపరిపాలన, NewzFast Telugu (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సునామీ సృష్టిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గర్హనీయమని, ఆక్షేపణీయమని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది సునామీలు సృష్టించడానికి కాదని, సుపరిపాలన అందించేందుకని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన సునామీ అంటే విధ్వంసం, వినాశనమని పేర్కొంటూ, మూడేళ్ల పాలనలో ప్రజలకు ఎదురైంది విధ్వంసమేనని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఆగస్టు నుంచి నవంబర్ వరకు వచ్చిన నీరు, దిగువకు వదిలిన నీరు, వినియోగించుకున్న జలాలు, ప్రాజెక్టులవారీగా అందించిన ఆయకట్టు వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, ఇన్వర్టర్ల వినియోగం పెరుగుతున్నాయని కూడా ఆయన విమర్శించారు.




