స్థానిక ఫలితాల్లో ప్రజల మద్దతు ప్రతిఫలించింది: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికలు: కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో అది స్పష్టంగా ప్రతిఫలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోవడానికి మన నిర్ణయాల్లో లోపాలే కారణమని, ప్రజల నుంచి ఎలాంటి లోపమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోదీ సహకారంతో కూటమి అద్భుత పనితీరు కనబరచిందని అన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపును తలకెక్కించుకోవద్దని, బాధ్యత మరింత పెరిగిందని భావించి ప్రజాసేవలో నిమగ్నం కావాలని మంత్రులకు సూచించారు.

స్థానిక ఎన్నికలు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో అది స్పష్టంగా ప్రతిఫలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోవడానికి మన నిర్ణయాల్లో లోపాలే కారణమని, ప్రజల నుంచి ఎలాంటి లోపమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోదీ సహకారంతో కూటమి అద్భుత పనితీరు కనబరచిందని అన్నారు.

అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపును తలకెక్కించుకోవద్దని, బాధ్యత మరింత పెరిగిందని భావించి ప్రజాసేవలో నిమగ్నం కావాలని మంత్రులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత సహకార ఎన్నికలకు వెళ్దామని, వీటిని జనవరిలో నిర్వహిస్తామని తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై క్యాబినెట్‌ భేటీ ప్రారంభంలో మంత్రులందరూ లేచి నిలబడి చప్పట్లతో చంద్రబాబును అభినందించారు. ఈ విజయానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కారణమని మంత్రులు ప్రశంసించారు.

మంత్రులు పరస్పరం కరచాలనం చేసుకుని అభినందనలు తెలియజేసుకున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు