శ్రీశైలం దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్ విరాళం

శ్రీశైలం దేవస్థానం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, శ్రీశాఖ ఆధ్వర్యంలో గురువారం టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్‌ను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్‌కుమార్‌రెడ్డి వాహనంతో పాటు సంబంధిత పత్రాలను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడుకు అందజేశారు. అంతకుముందు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, అర్చకస్వాములు, దేవస్థానం.

శ్రీశైలం దేవస్థానం, NewzFast Telugu (నంద్యాల): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, శ్రీశాఖ ఆధ్వర్యంలో గురువారం టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్‌ను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.

దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్‌కుమార్‌రెడ్డి వాహనంతో పాటు సంబంధిత పత్రాలను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడుకు అందజేశారు.

అంతకుముందు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, అర్చకస్వాములు, దేవస్థానం అధికారులు, బ్యాంకు ప్రతినిధులు సంప్రదాయబద్ధంగా వాహన పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్‌ను కొనుగోలు చేసి దేవస్థానానికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు.

ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈ వాహనాన్ని అన్నప్రసాద వితరణకు అవసరమైన కూరగాయల సరఫరా కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఎం. సుధాకర్, శ్రీశైలం బ్రాంచ్ మేనేజర్ రవీంద్రారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

దేవస్థానం తరఫున సహాయ కమిషనర్ ఇ. చంద్రశేఖరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు జి.

స్వాములు, ఎం. హరియానాయక్, పి.

ఉమేష్, పర్యవేక్షకులు సి.హెచ్. కోమలి, రవాణా విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.

చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు