ఈనెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన; ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి సమీక్ష

సిద్దిపేట సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తారని, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. ఈ.

సిద్దిపేట సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, NewzFast Telugu (సిద్దిపేట): రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే.

హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని తెలిపారు.

ఈ పర్యటనలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తారని, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సభ నిర్వహణ కోసం గతంలో ముఖ్యమంత్రి సభ జరిగిన నాగ దేవత గుడి సమీపంలోని ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఈరోజు పరిశీలించారని కలెక్టర్ తెలిపారు. భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, వీఐపీలకు, అధికారులకు ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు.

వాహనాల పార్కింగ్, ఎలిప్యాడ్, డయాస్, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టం, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు. రేపు బుధవారం ఉదయం నుంచి సభా ప్రాంగణంలో క్లీనింగ్, లెవలింగ్ పనులు చేపట్టాలని, డయాస్ ఏర్పాటు, విద్యుత్ తదితర ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వివిధ శాఖలకు సంబంధించిన వివరాలను అందజేయాలని కూడా కలెక్టర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు