శేఖర్ మాస్టర్ కారు ప్రమాదం, NewzFast Telugu (శంషాబాద్): టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా, శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ వార్త వైరల్ కావడంతో శేఖర్ మాస్టర్ ఎలా ఉన్నారనే ఆందోళన అభిమానులతో పాటు నెటిజన్లలో కూడా వ్యక్తమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో తనకు వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజులపై స్పందిస్తూ శేఖర్ మాస్టర్ ఒక వీడియో విడుదల చేశారు. నైట్ షూటింగ్ పూర్తి చేసుకుని ఉదయం 5:30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరినప్పుడు ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
కారు వెనుక భాగం నుజ్జునుజ్జు అయిందని చెప్పారు.
ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారని, అయ్యప్ప దయవల్ల ఎవరికీ ఏమీ జరగలేదని ఆయన వివరించారు. అందరూ బాగానే ఉన్నారని, సురక్షితంగా ఉన్నామని పేర్కొంటూ, అభిమానుల శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపారు.
అదే రాత్రి మళ్లీ షూటింగ్కు వెళ్లనున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ప్రస్తుతం శేఖర్ మాస్టర్ వీడియో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.




