శేఖర్ మాస్టర్ కారు ప్రమాదం, NewzFast Telugu (శంషాబాద్, హైదరాబాద్ శివార్లు): ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద నవంబర్ 12 తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకా సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ముగించుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శంషాబాద్ ముచ్చింతల్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడ్ లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్‌కు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
గాయాల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




