స్కేరీ పిక్చర్, NewzFast Telugu: టాలీవుడ్ నిర్మాత రానా దగ్గుబాటి ఒక విభిన్నమైన హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘స్కేరీ పిక్చర్’ అనే ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఓ ఈవెంట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ గురించి రానా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రానా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దశాబ్దాలుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరైన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆ సంస్థ నుంచి వస్తున్న అత్యంత విభిన్నమైన హారర్ చిత్రం ఇదే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, హారర్ జానర్‌ను ఇష్టపడే దర్శకులకు నిరంతరం ప్రొడక్షన్ సపోర్ట్, రిలీజ్ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘స్కేరీ పిక్చర్’తో ఈ కొత్త ప్రయాణం మొదలుపెట్టామని తెలిపారు. సైకలాజికల్, క్రీచర్, హారర్-కామెడీ, సోషల్ హారర్ వంటి ఏ కొత్త కాన్సెప్ట్‌తో ఫిల్మ్ మేకర్స్ వచ్చినా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
త్వరలోనే ఒక కొత్త పీడకల మొదలుకాబోతోంది, ఒక కొత్త భయంకరమైన కల నిజం కాబోతోంది అని రానా పేర్కొన్నారు. డాక్టర్ డి.
రామానాయుడు సమర్పణలో, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ సినిమాను 2027లో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.
ఇక అనసూయ, అవును ఫేమ్ రవిబాబు ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.




