సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త నిరసనలు, NewzFast Telugu: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మరోసారి నవంబర్ 26 నుంచి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
2021 నవంబర్ 19న మూడు చట్టాలను రద్దు చేసినప్పటికీ, అప్పుడు ఇచ్చిన హామీల్లో చాలావాటిని అమలు చేయలేదని ఎస్కేఎం పేర్కొంది. వాటి సాధన కోసం 100 ప్రాంతాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.
స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, రైతుల రుణాల పూర్తి మాఫీ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా కోరింది.
నాలుగు కార్మిక చట్టాల రద్దు, ఉపాధిహామీ పథకంలో 200 రోజుల పని, రోజువారీ రూ.700 వేతనం డిమాండ్లలో ఉన్నాయి. విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, జాతీయ ఆహార భద్రత బిల్లులను ఉపసంహరించుకోవాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని కూడా ఎస్కేఎం కోరింది.

