సమంత, NewzFast Telugu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొద్దిగా దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె పూర్తిగా యాక్టివ్‌గా ఉంటూ మెటర్నిటీ ఫొటోషూట్స్ షేర్ చేస్తున్నారు, కష్టమైన వర్కౌట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇటీవల బెడ్‌పై పడుకొని తన బేబీ బంప్‌ను చూపిస్తూ, ఇదే తన మెటర్నిటీ ఫొటోషూట్‌గా భావించాలని ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ఆధారంగా కొందరు ఆకతాయిలు ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి సమంతకు ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్లు ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఆ ఏఐ వీడియోలను నిజమని నమ్మిన ఒక బామ్మ, సమంతకు డెలివరీ అయిపోయిందని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయిందని తన మనవడితో గట్టిగా వాదించింది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ ఘటనపై స్పందించిన సమంత, ఆ వైరల్ వీడియోను చూసి ‘ఇంకా లేదు అమ్మమ్మ’ అంటూ సరదాగా నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు. ఏఐ వీడియోలను పెద్దవాళ్లు నిజమని నమ్ముతున్న ఈ విచిత్ర పరిస్థితిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు, అయితే సమంత బామ్మ వీడియోకు ఇచ్చిన క్యూట్ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.




