నారాయణగూడలో సదర్‌ వేడుకలు.. హాజరైన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సదర్ వేడుకలు: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్‌ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దీపావళి పర్వదినం అనంతరం నిర్వహించే ఈ వేడుకలు క్రమంగా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నారాయణగూడ సర్కిల్‌లో యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్‌ వేడుకలకు ఆయన హాజరై సందడి చేశారు. దీపావళి తర్వాత సదర్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం యాదవులలో ఆనవాయితీగా వస్తోందని తలసాని.

సదర్ వేడుకలు, NewzFast Telugu (హైదరాబాద్): యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్‌ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దీపావళి పర్వదినం అనంతరం నిర్వహించే ఈ వేడుకలు క్రమంగా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.

మంగళవారం నారాయణగూడ సర్కిల్‌లో యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్‌ వేడుకలకు ఆయన హాజరై సందడి చేశారు. దీపావళి తర్వాత సదర్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం యాదవులలో ఆనవాయితీగా వస్తోందని తలసాని తెలిపారు.

పాడి పరిశ్రమ, పశుపోషణను ప్రధాన వృత్తిగా కొనసాగించే యాదవులు ఏడాది పొడవునా తమ వృత్తిలో నిమగ్నమై ఉంటారని, సంవత్సరంలో ఒకరోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సమాజంలోని ఇతరులతో కలిసి సదర్‌ను పండుగలా జరుపుకుంటారని వివరించారు. యాదవుల జీవన విధానం, పశుసంపదపై వారికి ఉన్న అనుబంధం ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తుందని చెప్పారు.

సదర్‌ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే ప్రత్యేక జాతుల దున్నపోతుల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తలసాని పేర్కొన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల నుంచి భారీ ఆకారంతో, ప్రత్యేక లక్షణాలతో ఉండే దున్నపోతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రదర్శించడం ఈ వేడుకల ప్రత్యేకత అని తెలిపారు.

వాటి అలంకరణ, ఆకారం, పోషణ విధానం, వాటి వెనుక యాదవులు చూపించే శ్రద్ధ సందర్శకులను ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారని పేర్కొన్నారు.

సదర్‌ వేడుకలు యాదవుల సంప్రదాయానికి సంబంధించినవే అయినప్పటికీ, అన్ని వర్గాల ప్రజలు వాటిని ఎంతో ఆదరిస్తున్నారని తలసాని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కలిసి పాల్గొనడం సదర్‌ వేడుకల్లోని ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు.

యాదవుల చరిత్ర, సమాజానికి వారు అందించిన సేవలు ఎంతో గొప్పవని తలసాని పేర్కొన్నారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లోనూ యాదవుల ప్రస్తావన ఉందని, యాదవులు లేనిదే చరిత్ర లేదని అన్నారు.

నీతి, నిజాయితీకి పేరుగాంచిన యాదవులు తమ సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలను కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. సదర్‌ వేడుకలు యాదవుల ఐక్యతను చాటడంతో పాటు వారి సంస్కృతి, పశుపోషణ వృత్తి విశిష్టతను సమాజానికి పరిచయం చేస్తున్నాయని తెలిపారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు