వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, NewzFast Telugu (మంచిర్యాల, తెలంగాణ): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు, రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి లాభదాయక పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురిమిల్ల సౌమ్య, రాచకొండ గోపాల్ రావు, పీడీ మెప్మా సుభాష్, టీఎంసీ, ఐకేపీ సెంటర్ ఇంచార్జి వర్ష, అగ్రికల్చర్ ఏఈ మహేందర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగయ్య, దర్ని మల్లేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యాల కొమురయ్య, తీగలపహాడ్ మాజీ సర్పంచ్ తెలేటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీతారాంపల్లి ఇంచార్జి కొక్కిరాల మోహన్ రావు, మాజీ వార్డు సభ్యుడు గౌస్, స్థానిక రైతులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




