ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం, NewzFast Telugu (తెలంగాణ): ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గతంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.
బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆర్టీసీలో రికార్డ్ ట్రేసర్ (Record Tracer)గా నియమిస్తూ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి చేతుల మీదుగా హేమంత్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేయనున్నారు.
కష్టాల్లో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబానికి భరోసా కల్పించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఉద్యోగ హామీని నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.




