రో ఖన్నా కాలిఫోర్నియా 17వ జిల్లా విజయం, NewzFast Telugu: సిలికాన్ వ్యాలీలోని ఫ్రీమాంట్‌లో నివసిస్తూ తెలుగువారికి సుపరిచితుడైన రో ఖన్నా, అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టండన్‌పై విజయం సాధించారు.
1976లో ఫిలడెల్ఫియాలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రో ఖన్నా, 2017 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విజయంతో ఆయన ఆరోసారి కాలిఫోర్నియా పదిహేడవ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలుస్తోంది.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో లెక్చరర్‌గా, ఆ తర్వాత అడ్వకేట్‌గా పనిచేసిన రో ఖన్నా, ప్రెసిడెంట్ ఒబామా ప్రభుత్వంలో వాణిజ్య శాఖలో డిప్యూటీ అసిస్టెంట్‌గా కూడా సేవలందించారు.
అమెరికాలో తయారీ పరిశ్రమలు, టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కల్పన, అందరికీ అందుబాటులో వైద్యం, యుద్ధాల కంటే దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఆయన అభిప్రాయాలతో కమ్యూనిటీకి దగ్గరయ్యారు.

