రేణు దేశాయ్, NewzFast Telugu: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పవన్ వ్యతిరేకులు ఈ వ్యక్తిగత విషయంలో కూడా ఆయనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింత వేధించడం సరైన పద్ధతి కాదని రేణు దేశాయ్ అన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని మళ్లీ తొక్కడం అమానవీయమని, వారు ఏ స్థాయిలో ఉన్నా మనుషులేనని, ప్రతి ఒక్కరికీ దయ, సహానుభూతి అవసరమని ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.
ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేసే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. తన అభిప్రాయాలను పంచుకున్నందుకు ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని, సమాజం మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెబుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
అంతేకాదు, ఇతరులను బాధపెట్టి డబ్బు సంపాదించే పత్రికలు, యూట్యూబర్లపై కూడా రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరి కన్నీళ్లతో సంపాదించిన డబ్బు మంచిది కాదని, అలాంటి పనులకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.




