చెన్నై పోర్టులో రూ.7.72 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

ఎర్రచందనం పట్టివేత: పేపర్‌ లామినేట్‌ రోల్స్‌ మాటున ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టైంది. చెన్నై పోర్టు నుంచి మలేషియాకు ఎగుమతి అయ్యేందుకు సిద్ధంగా ఉన్న కంటైనర్‌లో 12.87 మెట్రిక్‌ టన్నుల హైగ్రేడ్‌ ఎర్రచందనం దుంగలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7.72 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ముగ్గురు కీలక వ్యక్తులను కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేశారు.

ఎర్రచందనం పట్టివేత, NewzFast Telugu (చెన్నై): పేపర్‌ లామినేట్‌ రోల్స్‌ మాటున ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టైంది. చెన్నై పోర్టు నుంచి మలేషియాకు ఎగుమతి అయ్యేందుకు సిద్ధంగా ఉన్న కంటైనర్‌లో 12.87 మెట్రిక్‌ టన్నుల హైగ్రేడ్‌ ఎర్రచందనం దుంగలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.7.72 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ముగ్గురు కీలక వ్యక్తులను కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేశారు.

నిర్దిష్ట నిఘా సమాచారంతో నవంబర్‌ 9 నుంచి 11వ తేదీ మధ్య డీఆర్‌ఐ అధికారులు చెన్నై పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న కంటైనర్‌ను అడ్డుకున్నారు. ఓ నౌకలో లోడ్‌ చేయకముందే దాన్ని తనిఖీకి తీసుకున్నారు.

అందులో ‘పేపర్‌ లామినేట్‌ రోల్స్‌’ ఉన్నట్లు ఎగుమతి పత్రాల్లో పేర్కొన్నారు.

అయితే నవంబర్‌ 9, 10 తేదీల్లో చేపట్టిన విస్తృత తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. కొంతమేర పేపర్‌ లామినేట్‌ రోల్స్‌తో పాటు కంకర రాళ్ల మధ్య భారీగా ఎర్రచందనం దుంగలను దాచినట్లు గుర్తించారు.

మొత్తం 12.87 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, కస్టమ్స్‌ చట్టం–1962 ప్రకారం సీజ్‌ చేశారు.

ఈ అక్రమ రవాణా కోసం ముఠా ఎగుమతి ప్రక్రియలోని నిబంధనలను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తయారీదారులు–ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న సెల్ఫ్‌ సీలింగ్‌ సదుపాయాన్ని ఆసరాగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

తొలుత ఓ ఎగుమతిదారు ద్వారా పేపర్‌ లామినేట్‌ రోల్స్‌తో కూడిన సరుకును పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

అనంతరం కంటైనర్‌ను ప్రైవేట్‌ గోదాముకు మళ్లించి, అందులోని పేపర్‌ రోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో ఎర్రచందనం దుంగలు, కంకర రాళ్లను నింపినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత కంటైనర్‌ను ఎగుమతికి పంపేందుకు సిద్ధం చేశారు.

కంటైనర్‌ను మళ్లించిన ప్రైవేట్‌ గోదాములోనూ డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎగుమతి పత్రాల్లో పేర్కొన్న అసలు పేపర్‌ లామినేట్‌ రోల్స్‌, పారిశ్రామిక తూకం యంత్రం, ఎర్రచందనం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురిని కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు