రామ్ చరణ్ RC-17, NewzFast Telugu (హైదరాబాద్): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘RC-17’ ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన వేడుకల్లో కోలీవుడ్ యంగ్ హీరో రిషికాంత్ ప్రత్యక్షమవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. మొదరాత్రి, డోరతి వంటి చిత్రాలతో వరస విజయాలు అందుకున్న రిషికాంత్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని, అందుకే పూజకు హాజరయ్యారని కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగింది.
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషికాంత్ ఈ ప్రచారంపై స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. తాను ‘RC-17’ సినిమాలో నటించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘మొదరాత్రి’ సినిమాలో తాను పనిచేసిన పరిచయంతోనే నిర్మాతలు పూజా కార్యక్రమానికి ఆహ్వానించారని, కేవలం వారి ఆహ్వానం మేరకే వేడుకకు వెళ్లానని చెప్పారు.
సినిమా విడుదలయ్యాక తెలుసుకోవడం కంటే ముందే నిజాన్ని తానే స్వయంగా చెప్పేస్తున్నానని రిషికాంత్ అన్నారు. అనవసరంగా ఎలాంటి పుకార్లు సృష్టించవద్దని మీడియాను, అభిమానులను ఆయన కోరారు.
ఈ స్పష్టతతో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ముగింపు పడినట్లయింది.




