రైతు గర్జన సభకు బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు తరలి వెళ్లారు

రైతు గర్జన సభ: అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా ముంచిందని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం రైతుల పక్షాన తలపెట్టిన రైతు గర్జన సభకు జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతున్న ఈ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక వాహనాల్లో ఉత్సాహంగా బయల్దేరారు. కేసీఆర్‌ పాలనలో బీడు భూములు పంటలతో కలకలలాడాయని, రైతులు సంతోషంగా.

రైతు గర్జన సభ, NewzFast Telugu (నిర్మల్‌): అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా ముంచిందని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం రైతుల పక్షాన తలపెట్టిన రైతు గర్జన సభకు జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతున్న ఈ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక వాహనాల్లో ఉత్సాహంగా బయల్దేరారు.

కేసీఆర్‌ పాలనలో బీడు భూములు పంటలతో కలకలలాడాయని, రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారని నాయకులు పేర్కొన్నారు. కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని ఆరోపించారు.

ఈ రైతు గర్జన సభతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చి రేపో ఎల్లుండో రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని విమర్శించారు. మంచిర్యాల, చెన్నూర్‌, జన్నారం, భీమారం, కోటపల్లి, దండేపల్లి తదితర మండలాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలివెళ్లారు.

దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన తీగల చంద్రయ్య పార్టీపై తనకున్న అభిమానంతో సొంత ఖర్చులతో ఆటోలో సభకు వెళ్తున్నారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు