ప్రియా భవానీ శంకర్, NewzFast Telugu: న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, అనంతరం సినీరంగంలో అడుగుపెట్టి విజయాలు అందుకున్న కథానాయిక ప్రియా భవానీ శంకర్ తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ‘ఇరుముడి’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.
తాజా సమాచారం ప్రకారం ఈ నటి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియుడు రాజవేల్ రాజన్‌తో కలిసి తీయించుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తులు ధరించిన ఈ జంట మెడలో మల్లెపూల దండలు, నుదుటిపై చందనం బొట్లతో కనిపిస్తున్నారు. వీటిని చూసిన అభిమానులు ప్రీ వెడ్డింగ్ వేడుక ఏమైనా జరిగిందా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే తమ వివాహంపై ప్రియా భవానీ శంకర్, రాజవేల్ రాజన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాలేజీ రోజుల నుంచే ఈ జంట ప్రేమలో ఉన్నారని, గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ప్రియా భవానీ శంకర్ ‘డిమోంటే కాలనీ-3’ చిత్రంలో నటిస్తున్నారు.




