ప్రైవేటు బస్సు చార్జీలు, NewzFast Telugu (అమరావతి): పండుగలు, వారాంతాల్లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు (ట్రావెల్స్) అధిక చార్జీలు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ఈ ఏడాది జూలై 20న పిటిషనర్ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల్లో రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని పేర్కొంటూ పిల్‌ను డిస్పోజ్ చేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పండుగలు, వారాంతాలు, రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన అధిక చార్జీలు వసూలు చేయకుండా ప్రైవేటు బస్సు నిర్వాహకులను అడ్డుకునేలా రవాణాశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన చిట్టినేని సాంబశివరావు ఈ పిల్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది తాండవ యోగేశ్ వాదనలు వినిపించారు.




