మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వ పరిహారం, NewzFast Telugu (హైదరాబాద్): మణుగూరు డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతదేహానికి ఉస్మానియా దవాఖాన మార్చురీ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రవళిక తల్లి, కుటుంబసభ్యులను ఓదార్చిన అధికారులు, ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు. అలాగే బ్యాంకు ద్వారా రూ.
కోటి ప్రమాద బీమా అందజేస్తామని చెప్పారు.
ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. నిందితురాలిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
మృతురాలి తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ, తన భర్త గుండు వెంకటనాగరాజు 2024లో విధి నిర్వహణలో మరణించారని, కారుణ్య నియామకం కింద ప్రవళికకు 2025 డిసెంబర్లో ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కూతురు కూడా మరణించడంతో తనకు దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవళిక మృతికి సంతాపంగా గురువారం మణుగూరు డిపోలో బంద్ పాటిస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదూరి వెంకన్న తెలిపారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ.
కోటి పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

