Pico Technology India office inauguration Hyderabad, NewzFast Telugu (హైటెక్ సిటీ, హైదరాబాద్): న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్, డాటా మరియు అనలిటిక్స్ సేవలు అందించే పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని శుక్రవారం హైటెక్ సిటీలో ప్రారంభించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు హైదరాబాద్‌ను అడ్డాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
పికో టెక్నాలజీ విస్తరణతో యువతకు ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
కార్యక్రమంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపకుడు, సీఈవో జారోడ్ యూస్టర్ తదితరులు పాల్గొన్నారు.
