పటాస్ ప్రవీణ్ తండ్రి, NewzFast Telugu (హైదరాబాద్): జబర్దస్త్ కామెడీ షోలో తనదైన పంచులతో ఆకట్టుకుంటున్న పటాస్ ప్రవీణ్ తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను ఆయన హాస్పిటల్ నుంచే వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి అయిన ప్రవీణ్, ప్రముఖ డాన్సర్ కడెం వంశితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వివాహానికి జబర్దస్త్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు హాజరయ్యారు.
వంశిత ఇటీవల గర్భం దాల్చిన విషయాన్ని కూడా ప్రవీణ్ అభిమానులతో పంచుకున్నారు.
ప్రవీణ్ షేర్ చేసిన వీడియోలో ప్రసవానికి ముందు ఆయన భార్యకు సేవలు చేయడం, వంశిత ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లడం, డాక్టర్ పాపను తీసుకురావడం, ఆ పాపను ఎత్తుకుని ప్రవీణ్ సంతోషపడటం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో పాప ముఖాన్ని కూడా చూపించారు.
“మా అమ్మ మళ్లీ పుట్టింది” అని ప్రవీణ్ ఆనందభాష్పాలతో చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు ప్రవీణ్, వంశిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పటాస్ షోతో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్, స్టాండప్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. జబర్దస్త్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఆయన సందడి చేశారు.




