పాస్పోర్ట్ మేళా హైదరాబాద్, NewzFast Telugu (హైదరాబాద్): పాస్పోర్ట్ సేవల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ప్రత్యేక అవకాశం కల్పించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్మెంట్ల కోసం నెలకొన్న నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పాస్పోర్ట్ మేళా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈనెల 21న నగరంలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి మాదవ్ రచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో భాగంగా సాధారణ పాస్పోర్ట్, తతాల్ పాస్పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సేవలకు సంబంధించి సుమారు 4 వేల అపాయింట్మెంట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
ఈ అపాయింట్మెంట్లను నవంబర్ 3 నుంచి విడుదల చేస్తామని వివరించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల (పీఓపీఎస్కే) పరిధిలో ఈ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంటాయి.
పాస్పోర్ట్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు దరఖాస్తుదారులకు నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ ప్రత్యేక మేళా లక్ష్యమని ఆర్పీఓ వెల్లడించారు.

