పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్, NewzFast Telugu (హైదరాబాద్): దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీసింగ్ సేవలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తేనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. సాంకేతిక ఏర్పాట్లు, పోలీస్ రికార్డులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సేవల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఫిర్యాదు స్వీకరణ నుంచి దర్యాప్తు, ఛార్జిషీట్ రూపకల్పన వరకు పోలీసింగ్‌లోని ప్రతి దశలోనూ ఏఐ సాంకేతికతను వినియోగించనున్నట్లు సజ్జనార్ మాట్లాడుతూ చెప్పారు.




