మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు: మొదటి విడత నోటిఫికేషన్ రేపు విడుదల

పంచాయతీ ఎన్నికలు: మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. శుక్రవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండో విడతకు 16న, మూడో విడతకు 19న షెడ్యూల్ విడుదల కానుంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు 15న ఎన్నికల నోటీసు ఇస్తారు. 17లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునేందుకు 19వ తేదీ, వాటిని పరిష్కరించేందుకు 20వ.

పంచాయతీ ఎన్నికలు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. శుక్రవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

రెండో విడతకు 16న, మూడో విడతకు 19న షెడ్యూల్ విడుదల కానుంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు 15న ఎన్నికల నోటీసు ఇస్తారు. 17లోపు నామినేషన్లు స్వీకరిస్తారు.

18న నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునేందుకు 19వ తేదీ, వాటిని పరిష్కరించేందుకు 20వ తేదీ, ఉపసంహరణకు 21వ తేదీ ఆఖరు తేదీలుగా నిర్ణయించారు.

అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.

మొదటి విడతకు సంబంధించి ఈ నెల 26న ఓటింగ్ జరగనుండగా, అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోల్ నిర్వహించాల్సి వస్తే 27న చేపడతారు.

అదే రోజు లేదా ఆ మరుసటి రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు.

చిన్న రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒకేసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, పెద్ద డివిజన్లకు మాత్రం రెండు దఫాలుగా నిర్వహిస్తారు. తొలి దశలో 39 రెవెన్యూ డివిజన్లలోని 209 మండలాల పరిధిలోని పంచాయతీల్లో 26న ఎన్నికలు జరుగనున్నాయి.

రెండో దశలో 46 డివిజన్లలోని 239 మండలాలు, మూడో విడతలో 43 రెవెన్యూ డివిజన్లలోని 205 మండలాల పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు