పాలమూరు వలసలు, NewzFast Telugu (మహబూబ్‌నగర్, తెలంగాణ): మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చి, కులవృత్తుల వారికి చేతినిండా పని కల్పించడంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారని ఆయన అన్నారు.
ప్రస్తుత పాలనలో పాలమూరును మళ్లీ వలసలకు కేంద్రంగా మార్చే కుట్ర జరుగుతున్నదని, మళ్లీ ముంబై, పుణె బస్సులు నడిపే రోజులు వస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లి, మహ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఎండిన పంటలను పరిశీలించిన నేతలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే, ప్రభుత్వం రైతుమేళాలు నిర్వహిస్తుండటం హాస్యాస్పదంగా ఉన్నదని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి తక్షణమే పరిహారం అందించాలని ఆయన కోరారు.




