పాకిస్థాన్ అమెరికా సంబంధాలు చైనా ఆర్థిక కారిడార్, NewzFast Telugu: భారత సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా మధ్య దశాబ్దాలుగా దౌత్య, వ్యూహాత్మక, సైనిక, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరినొకరు ఐరన్ బ్రదర్స్ అని పిలుచుకుంటాయి.
చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కింద గ్వదర్ పోర్టు నుంచి చైనాలోని జెన్ జియాంగ్ పోర్టు వరకు రైలు, రోడ్డు మార్గాలు, మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఇరు దేశాల బంధానికి కీలకంగా ఉన్నాయి.
అయితే గత కొంతకాలంగా పాకిస్థాన్ చైనాను పక్కనపెట్టి అమెరికాకు దగ్గరవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పు మరింత స్పష్టమైందని పేర్కొంటున్నారు.
ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్ష నేత, జమియత్ ఉలేమా ఎ ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్ విమర్శలు చేశారు. అమెరికాకు దగ్గరవుతూ పాకిస్థాన్ ఆర్మీ చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌ను నీరుగారుస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ చర్యల వల్ల చైనాకు భారత్‌పై నమ్మకం తగ్గుతోందని, పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాతో పాటు ఇతర దేశాలు కూడా వెనకడుగు వేయవచ్చని ఆయన హెచ్చరించారు. చైనాతో దశాబ్దాల మైత్రిని అమెరికా దెబ్బతీస్తోందని కూడా విమర్శించారు.
పాకిస్థాన్ అరుదైన ఖనిజ నిల్వలపై అమెరికా ఆసక్తి చూపుతోందని, అందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో స్నేహానికి మొగ్గు చూపుతున్నారని కొన్ని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై భారత్ అప్రమత్తమై పాకిస్థాన్-అమెరికా సంబంధాలను పరిశీలిస్తోందని వార్త వెల్లడించింది.

