ఓయూ హాస్టళ్ల కూల్చివేతను నిలిపివేయాలని రిజిస్ట్రార్‌కు వినతి

ఓయూ హాస్టళ్ల కూల్చివేత: ఉస్మానియా యూనివర్సిటీలోని E1, D, E2 వసతి గృహాల కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని, ఆయా హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థి నేత జంగయ్య ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, నూతన హాస్టళ్లు, ఆధునిక ల్యాబ్‌లు, సౌకర్యవంతమైన గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఓయూ హాస్టళ్ల కూల్చివేత, NewzFast Telugu (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీలోని E1, D, E2 వసతి గృహాల కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని, ఆయా హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థి నేత జంగయ్య ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, నూతన హాస్టళ్లు, ఆధునిక ల్యాబ్‌లు, సౌకర్యవంతమైన గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు నరేష్, వంశీ, శ్రవణ్, ప్రదీప్, ఫయాజ్, చరణ్, శ్రీనివాస్‌రెడ్డి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు