ఓయూలో హాస్టళ్ల కూల్చివేత ప్రయత్నాలు విరమించుకోవాలని బీఆర్‌ఎస్వీ డిమాండ్

ఓయూ హాస్టళ్ల కూల్చివేత: ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిస్తున్న ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని బీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేశ్ డిమాండ్ చేశారు. ఆ హాస్టళ్లకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వివిధ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓయూ చీఫ్ వార్డెన్.

ఓయూ హాస్టళ్ల కూల్చివేత, NewzFast Telugu (ఉస్మానియా యూనివర్సిటీ): ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిస్తున్న ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని బీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేశ్ డిమాండ్ చేశారు.

ఆ హాస్టళ్లకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో వివిధ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్ నగరంలో వేలాది మంది విద్యార్థులకు ఆశ్రయమిస్తున్న ఇటువంటి హాస్టళ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని నరేశ్ అన్నారు. నిరుద్యోగులపై కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే నిరుద్యోగులే ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు