నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ బదిలీలు, NewzFast Telugu (హైదరాబాద్): నిజామాబాద్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా కళాసాగర్ నియమితులయ్యారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను నిజామాబాద్ జైలుకు బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన దశరథం కొద్ది నెలలుగా పోస్టింగ్ కోసం వేచి ఉన్నారు. ఆయనకు ఇప్పుడు వరంగల్ జైలు బాధ్యతలు అప్పగించారు.
చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎ. వెంకటేశంను కరీంనగర్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.
అక్కడ ఉన్న జి. విజయ్‌ను చర్లపల్లికి మార్చారు.
వీరితోపాటు పరిగి, చర్లపల్లి నుంచి మరో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లనూ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

