న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికలో సరితారెడ్డి, NewzFast Telugu: అమెరికాలోని న్యూయార్క్ అటార్నీ జనరల్ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మూలాలున్న మహిళ పోటీ చేస్తున్నారు.
ప్రస్తుత జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని ముంపు గ్రామమైన చెగ్యాంకు చెందిన హనుమంతరెడ్డి, గీతారెడ్డిల కుమార్తె సరితారెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఆమె కుటుంబం సుమారు 45 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది.
సరితారెడ్డి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు కాగా, బ్రూక్లిన్ సిటీలో పుట్టి, పెరిగిన ఆమె న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. ఈ పోటీ నేపథ్యంలో స్వగ్రామంలో బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


