అమెరికాలో నల్గొండ యువతి శ్రీజ అదృశ్యం; కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్

అమెరికాలో నల్గొండ యువతి శ్రీజ అదృశ్యం: అమెరికాలో నల్గొండ యువతి శ్రీజ ఇటీవల అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి–రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. శ్రీజ స్నేహితులు ఆమె ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని తల్లిదండ్రులకు సమాచారం.

అమెరికాలో నల్గొండ యువతి శ్రీజ అదృశ్యం, NewzFast Telugu (అమెరికా, బోస్టన్): అమెరికాలో నల్గొండ యువతి శ్రీజ ఇటీవల అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి–రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లారు.

ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.

శ్రీజ స్నేహితులు ఆమె ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

దీంతో తల్లిదండ్రులు బిడ్డ ఆచూకీ కోసం ఎదురుచూస్తూ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. శ్రీజ మిస్సింగ్ వార్త వైరల్ అవ్వడంతో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారు.

మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ సైతం బాధిత కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అక్కడ తెలిసిన వారితో తాను మాట్లాడతానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు