ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

ముస్లిం రిజర్వేషన్లు: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల్లో లక్షలాది మంది ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పార్టీ తెచ్చిన రిజర్వేషన్‌ ఇదని, దీన్ని తొలగించేవాడు ఇంకా పుట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, వారు ముందుగా గుజరాత్‌లో అమలవుతున్న ముస్లిం.

ముస్లిం రిజర్వేషన్లు, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల్లో లక్షలాది మంది ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు.

ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పార్టీ తెచ్చిన రిజర్వేషన్‌ ఇదని, దీన్ని తొలగించేవాడు ఇంకా పుట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, వారు ముందుగా గుజరాత్‌లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించి చూపాలని సీఎం సవాల్‌ విసిరారు.

ఢిల్లీ నుంచి మోదీ, అమిత్‌ షా ఇక్కడికి బాటసారులుగా వస్తుంటారు, పోతుంటారని, ఇక్కడ రిజర్వేషన్లు మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు ఢిల్లీ చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయానికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.

భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని బంజారా భవన్‌లో మైనారిటీ శాఖ నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీ వర్గాలు ప్రగతి సాధించినప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు.

మైనారిటీల్లో పేదరికం తొలగించాలన్న ఉద్దేశంతో సచార్‌ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు. మారుతున్న పరిస్థితుల్లో విద్య ఒక్కటే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా స్కిల్స్‌ ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతోందని ఆయన పేర్కొన్నారు.

పిల్లలను బాగా చదివించాలని, చదువుల పట్ల ఆసక్తి లేనివారికి స్కిల్స్‌ నేర్పించాలని లేదా క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు.

క్రికెటర్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చారని, వారిని ప్రభుత్వం గ్రూప్‌-1 ఆఫీసర్లుగా నియమించి ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, పరిసరాల్లో నైట్‌ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ పనులు వచ్చే రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయని, మీరాలం ట్యాంక్‌ మరో ఏడాదిలో సుందరమైన ప్రదేశంగా రూపుదిద్దుకోనుందని ఆయన చెప్పారు. ఓల్డ్‌ సిటీని కాకుండా ఒరిజినల్‌ సిటీని తిరిగి పునరుద్ధరించడం కోసం చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, వీ హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు