మస్కట్ బాధితురాలు లక్ష్మి కేటీఆర్ కృతజ్ఞతలు, NewzFast Telugu (కొడంగల్, తెలంగాణ): మస్కట్ నుంచి తనను క్షేమంగా స్వదేశానికి చేర్చినందుకు బాధితురాలు తుప్పుడు లక్ష్మి మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి కోసం గత ఫిబ్రవరిలో మస్కట్‌కు వెళ్లిన కొడంగల్ నియోజకవర్గం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఏజెంట్ తొలుత చెప్పిన దానికి భిన్నంగా పని అప్పగించడమే కాకుండా, యజమాని (కఫీల్) ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించారు.

