తెలంగాణ పోలీసుశాఖలో సేవలకు గుర్తింపు: శ్రీకాకుళం జిల్లా వాసి మురళీకృష్ణకు ఉత్కృష్ట సేవా పతకం

మురళీకృష్ణ ఉత్కృష్ట సేవా పతకం: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామానికి చెందిన కంచరాపు మురళీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్కృష్ట సేవా పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన 15 ఏళ్లపాటు అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించడంతో ఈ గౌరవం దక్కింది. 2011 జనవరి 14న రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసుశాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మురళీకృష్ణ, హైదరాబాద్ సీఐడీ, మల్కాజిగిరి సీఐ తదితర విభాగాల్లో విధులు నిర్వహించారు. క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ.

మురళీకృష్ణ ఉత్కృష్ట సేవా పతకం, NewzFast Telugu (సరుబుజ్జిలి, శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామానికి చెందిన కంచరాపు మురళీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్కృష్ట సేవా పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన 15 ఏళ్లపాటు అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించడంతో ఈ గౌరవం దక్కింది.

2011 జనవరి 14న రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసుశాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మురళీకృష్ణ, హైదరాబాద్ సీఐడీ, మల్కాజిగిరి సీఐ తదితర విభాగాల్లో విధులు నిర్వహించారు. క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.

తన సేవలకు గుర్తింపుగా తెలంగాణ పోలీసు సేవా పతకం, ప్రాథమిక శిక్షణ సమయంలో హోంమంత్రి పతకం, తెలంగాణ దశాబ్ధి పతకంతో పాటు పలు నగదు బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు. మొత్తం 115 రివార్డులు, 25 కమెండేషన్లు, పది ప్రశంసలు, 13 మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీలు, 45 గుడ్ సర్వీస్ ఎంట్రీలు ఆయన సేవా ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచాయి.

ఇప్పుడు 2026 సంవత్సరానికి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన ఆయన, తెలంగాణ డీజీపీ ద్వారా ఉత్తర్వులు అందుకున్నారు. మురళీకృష్ణకు ఈ గౌరవం లభించడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు