ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం, NewzFast Telugu (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో బుధవారం అత్యధికంగా 238.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి మండలంలో పలు ప్రాంతాల్లో జనజీవనం ఇబ్బందుల్లో పడింది.
భారీ వర్షంతో తాళ్లపాయ పంచాయతీ పరిధిలోని సనరత్ చెరువు అలుగు పొంగిపొర్లింది. దీంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు 20 డబుల్ బెడ్ రూం ఇళ్లు నీట మునిగాయి.
భారీ వరదలకు పాల్వంచ, దమ్మపేట ప్రధాన రహదారిపై రాజుపేట వద్ద కూలిన వంతెన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

