పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 6న ఓటరు నమోదు గడువు ముగుస్తుందని ఆయన గుర్తు చేశారు. దసరా, దీపావళి పండుగలు మధ్యలో రావడంతో చాలామంది అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోలేకపోయారని తెలిపారు.
వారందరికీ అవకాశం కల్పించేందుకు తుది గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఆయన కోరారు. అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
