అప్పుల కోసం పక్కింటి మహిళ నగల చోరీ, హత్య – మీర్‌పేట్‌లో మాజీ ప్రొఫెసర్ అరెస్ట్

మీర్‌పేట్ హత్య కేసు: స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయిన ఒక మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి తాను నివసించే భవనంలోనే ఉండే ఒక మహిళ మెడలోని బంగారు నగలు అపహరించాలని పథకం వేశాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అతడిని ఆ మహిళ గుర్తు పట్టడంతో, తన గుట్టు రట్టవుతుందని భావించి ఆమెను దారుణంగా హత్య చేసి నగలు చోరీ చేశాడు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో జరిగిన ఈ దారుణంపై దర్యాప్తు ప్రారంభించిన.

మీర్‌పేట్ హత్య కేసు, NewzFast Telugu (మీర్‌పేట్, హైదరాబాద్): స్టాక్‌మార్కెట్‌లో భారీగా నష్టపోయిన ఒక మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి తాను నివసించే భవనంలోనే ఉండే ఒక మహిళ మెడలోని బంగారు నగలు అపహరించాలని పథకం వేశాడు.

ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అతడిని ఆ మహిళ గుర్తు పట్టడంతో, తన గుట్టు రట్టవుతుందని భావించి ఆమెను దారుణంగా హత్య చేసి నగలు చోరీ చేశాడు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో జరిగిన ఈ దారుణంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.

గురువారం ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన అరుణ్‌కుమార్, భార్య అనిత (34), ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెలగూడ సమీపంలోని ధాతునగర్‌లోని శ్రీలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.

అదే బ్లాకులోని నాలుగో అంతస్తులో నివసించే గద్ద రాజ్‌కుమార్ (41) గతంలో ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి రూ.4 కోట్ల వరకు నష్టపోయిన రాజ్‌కుమార్ భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు కింది అంతస్తులో ఉంటున్న అనిత వద్ద ఉన్న నగలు కొట్టేయాలని పథకం వేశాడు.

తలకు హెల్మెట్ పెట్టుకుని చోరీకి ప్రయత్నించాడు.

అనిత అతడిని గుర్తించి గట్టిగా అరవడంతో, పక్కనే ఉన్న ఇస్త్రీ పెట్టెతో దాడి చేసి ఆమెను చంపేశాడు. నగలను ఒక చోట దాచిపెట్టి ఎప్పటిలాగే ఇంటికి వెళ్లిపోయాడు.

సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన అనిత పిల్లలు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూశారు.

వెంటనే ఆమెను డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు రాజ్‌కుమార్‌ను అనుమానించి గట్టిగా నిలదీయడంతో అతడు నేరం ఒప్పుకున్నాడు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు