మాయలేడీ, NewzFast Telugu (తెలంగాణ): రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాయలేడీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ, కంటెంట్‌ను నమ్ముకొని ఈ సినిమా చేశామని తెలిపారు. సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్‌తో పాటు ప్రతిభావంతులైన టీమ్ ఈ సినిమా కోసం పనిచేసిందని, ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.
కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించగల సినిమా ఇదని ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు ప్రశంకర్ మాట్లాడుతూ, కమర్షియల్ హంగులతో సాగే ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇదని, కథలో ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. తెరపై ప్రేక్షకులు ఓ కొత్త తరహా లవ్‌స్టోరీని చూస్తారని ఆయన తెలిపారు.
చిత్ర కథానాయిక మధుమిత సర్కార్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.




