Chandrayaan Telugu film release November 13, NewzFast Telugu: గ్రామీణ నేపథ్యంలో సాగే హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘చంద్రయాన్’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ఇంకా 10 రోజులే ఉందని చెబుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
సమాజంలో తమను తక్కువ చేసి మాట్లాడిన వారి ముందు తమ ప్రతిభను నిరూపించుకోవాలని నలుగురు గ్రామీణ యువకులు నిర్ణయించుకుంటారు. ఎవరికీ అంతుచిక్కని ఆలోచనగా సొంతంగా ఒక రాకెట్ తయారు చేసి చంద్రమండలానికి వెళ్లాలని వారు సాహసించడం ఈ చిత్ర ప్రధానాంశం.
మందమర్రి టూ చందమామ సాగే ఈ ప్రయాణం ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీనాథ్ చంద్రశేఖర్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు.
ప్రవీణ్ మొలక నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వేణు ఊడుగుల సమర్పిస్తున్నారు.
శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, ‘బలగం’ సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్ష ప్రవీణ్ సంగీతం అందించగా, ఆదిత్య మ్యూజిక్ ఆడియోను విడుదల చేసింది.
ఇటీవల హైదరాబాద్‌లో రాకెట్ రివీల్ ఈవెంట్ నిర్వహించగా, దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది పూర్తిగా హానెస్ట్, ఇన్నోసెంట్ ప్రయత్నమని సమర్పకులు వేణు ఊడుగుల పేర్కొన్నారు.
కుటుంబ సమేతంగా నవ్వుకునేలా రూపొందిన ‘చంద్రయాన్’ నవంబర్ 13న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.


