విద్యా రంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్

మౌలానా అబుల్ కలాం ఆజాద్: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి.

మౌలానా అబుల్ కలాం ఆజాద్, NewzFast Telugu (మంచిర్యాల): భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.

బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు పరిశోధనా రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి దేశ ప్రగతికి దోహదపడిందన్నారు. విద్య కేవలం ఉద్యోగం పొందేందుకు మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక సమానత్వానికి, దేశాభివృద్ధికి ప్రధాన సాధనమని ఆజాద్ విశ్వసించారని తెలిపారు.

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు