మల్లాపూర్ అంగన్వాడీ కేంద్రం, NewzFast Telugu (రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘పది నిమిషాల కార్యక్రమం’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ (ఇన్చార్జ్) డీపీఓ వీరభద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందించాల్సిన పోషకాహారంపై తల్లిదండ్రులకు వివరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం చిన్నారులతో పాటు గర్భిణీ మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సూపర్వైజర్ వనిత, గ్రామపంచాయతీ కార్యదర్శి, గర్భిణీ మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




