మలేరియా మాత్రలు వికటించిన ఘటనపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు

మలేరియా మాత్రలు వికటించిన ఘటన: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూపులో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల బాలిక మృతి చెందగా, మరో 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈ ఏడాది సెప్టెంబరు ఒకటిన జరిగిన ఈ ఘటనపై ఎస్ఐ స్థాయి అధికారి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంతటి తీవ్రమైన ఘటనపై కనీసం డీఎస్పీ స్థాయి అధికారి నివేదిక ఇవ్వాల్సి ఉండగా, ఎస్ఐతో నివేదిక సమర్పించడం ప్రభుత్వానికి.

మలేరియా మాత్రలు వికటించిన ఘటన, NewzFast Telugu (అమరావతి): పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూపులో మలేరియా మాత్రలు వికటించి ఏడేళ్ల బాలిక మృతి చెందగా, మరో 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈ ఏడాది సెప్టెంబరు ఒకటిన జరిగిన ఈ ఘటనపై ఎస్ఐ స్థాయి అధికారి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇంతటి తీవ్రమైన ఘటనపై కనీసం డీఎస్పీ స్థాయి అధికారి నివేదిక ఇవ్వాల్సి ఉండగా, ఎస్ఐతో నివేదిక సమర్పించడం ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దాఖలు చేసిన నివేదికలో విచారణకు అవసరమైన ప్రాథమిక వివరాలు కూడా లేవని పేర్కొంది.

బాధితులకు ఇచ్చిన మాత్రలను ఎక్కడ తయారు చేశారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయి, వాటి తయారీ తేదీలేమిటి వంటి వివరాలను సేకరించలేదని ఆక్షేపించింది. నిపుణుల వైద్య నివేదికను పొందకపోవడంతో పాటు మృతురాలి వైద్య రికార్డులను పరిశీలించలేదని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కూడా సమర్పించలేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, విచారణ పురోగతిని వివరిస్తూ పది రోజుల్లో సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం జిల్లా ఎస్పీ, జిల్లా వైద్యాధికారి ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

ఎస్పీ, జిల్లా వైద్యాధికారిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.

ఈ ఘటనపై తెలంగాణకు చెందిన న్యాయవాది నల్లపు మణిదీప్ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి వ్యవహారాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టుకు ఆదేశించింది.

దీంతో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. గత నెలాఖరులో జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది ఎ ఛాయాదేవిని కోర్టు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమించింది.

బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేటస్ రిపోర్టు సమర్పించినట్లు ధర్మాసనానికి తెలిపారు. చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు