మాడ్గుల సింగిల్ విండో డైరెక్టర్ కొండల్ రెడ్డి రాజీనామా యోచన, NewzFast Telugu (మాడ్గుల): మాడ్గుల సింగిల్ విండో చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యుల జాబితాను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత సూధిని వెంకట్ రామ్ రెడ్డి (కొండల్ రెడ్డి) చైర్మన్ పదవి కోసం గట్టిగా ప్రయత్నించారని సమాచారం. అయితే విడుదలైన జాబితాలో ఆయన పేరు డైరెక్టర్ల జాబితాలో ఉంది.
ఈ పరిణామంతో ఆయన, ఆయన అభిమానులు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి ముందే డైరెక్టర్ పదవికి రాజీనామా చేయవచ్చని వినికిడి ఉంది.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. గురువారం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలవనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, జాబితాలో ఎమ్మెల్యే తన ప్రాధాన్యతను చూపారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమకు సమాచారం ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
