ఎల్‌ఐసీ రెండో త్రైమాసికంలో 20 శాతం పెరిగిన నికర లాభం

ఎల్‌ఐసీ త్రైమాసిక లాభం: దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ రూ.12,076 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,053 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. బీఎస్‌ఈకి అందించిన సమాచారం ప్రకారం, ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు పెరిగింది. ఆదాయంలో నూతన ప్రీమియం వసూళ్ల ద్వారా.

ఎల్‌ఐసీ త్రైమాసిక లాభం, NewzFast Telugu: దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ రూ.12,076 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,053 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. బీఎస్‌ఈకి అందించిన సమాచారం ప్రకారం, ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు పెరిగింది.

ఆదాయంలో నూతన ప్రీమియం వసూళ్ల ద్వారా రూ.1,47,018 కోట్లు, రెన్యువల్‌ ప్రీమియం వసూళ్ల ద్వారా రూ.68,375 కోట్లు సమకూరాయి. అయితే తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.10,836 కోట్ల నుంచి రూ.10,432 కోట్లకు తగ్గినట్టు సంస్థ పేర్కొంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు