రాష్ట్రంలో భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయి దాటిందని మంత్రి పొంగులేటి వెల్లడి

భూ రీసర్వే: రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయి దాటిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు. తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు యజమానులకు స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో రీసర్వే పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌.

భూ రీసర్వే, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయి దాటిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు.

తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు యజమానులకు స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో రీసర్వే పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 2,720 గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు. సర్వేకు ముందు రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ఆధారంగానే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా భూదార్‌ నంబర్‌ కేటాయింపును వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు